సినిమా సెట్‌లో కుప్పకూలి మలయాళ నటుడు మృతి
ABN, First Publish Date - 2020-09-14T22:07:12+05:30
సినిమా సెట్‌లో కుప్పకూలి మలయాళ నటుడు మృతి
కొచ్చి: మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా షూటింగ్ చేస్తుండగా హీరో ప్రబీష్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. 44 ఏళ్ల మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రబీష్ చక్కలక్కల్ కేరళ కొచ్చిలో సినిమా షూటింగ్ చేస్తుండగా కుప్పకూలి మరణించారు. సహోద్యోగులు అతన్ని ఆస్పపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ఎటువంటి వాహనం ఆగలేదని ఆరోపించారు. ఒక జట్టు సభ్యుడు తరువాత తన జేబులో నుంచి ప్రబీష్ కారు కీను కనుగొని ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-09-14T22:07:12+05:30 IST