ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్-19: మహరాష్ట్రలో ఐదు జైళ్లు మూసివేత

ABN, First Publish Date - 2020-04-10T18:53:56+05:30

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరిన్ని చర్యలు చేపట్టింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు  మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరిన్ని చర్యలు చేపట్టింది. ముంబై, పుణే ప్రాంతంలోని మొత్తం ఐదు జైళ్లను మూసివేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వీటిని తెరవొద్దంటూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్ విధించిన జైళ్ల జాబితాలో ముంబై సెంట్రల్ జైలు, థానే జైలు, యరవాడ జైల్, బైకుల్లా జైల్, కల్యాణ్ జైల్ తదితర కారాగారాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఖైదీలెవరూ లోపలికి వెళ్లడానికి గానీ, లోపలి నుంచి ఎవరూ బయటికి వచ్చేందుకు అనుమతి ఉండదు. కాగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,364 మందికి కోవిడ్-19 సోకినట్టు గుర్తించారు. వీరిలో 125 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా... ఈ మహమ్మారి కారణంగా 97 మంది చనిపోయారు. 


కాగా దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇవాళ 6,412కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 12 గంటల్లోనే 547 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించామని తెలిపింది. 

Updated Date - 2020-04-10T18:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising