ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై తేల్చి చెప్పిన మహారాష్ట్ర ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-07-14T04:14:30+05:30

మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ పరీక్షల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి ఉదయ్ సామంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఫైనల్ ఇయర్ యూనివర్సిటీ పరీక్షలను నిర్వహించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే.. ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించబోమని చెప్పడం లేదని.. కానీ కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న ఈ తరుణంలో పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదనేదే తమ భావన అని చెప్పారు.


అంతేకాదు, ఆయన ఓ ఉదాహరణను కూడా చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాలు యూనివర్సిటీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ చెప్పిందని, అయితే.. బెంగళూరులో కోవిడ్-19 వ్యాప్తి సందర్భంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. వారిలో చాలామంది విద్యార్థులకు కరోనా సోకిందని మంత్రి ఉదయ్ సామంత్ గుర్తు చేశారు. యూజీసీ మరోసారి నిర్ణయంపై పునరాలోచన చేయాలని, కేంద్రం తమ వినతిని మన్నించాలని మంత్రి ఉదయ్ సామంత్ కోరారు.

Updated Date - 2020-07-14T04:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising