ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ మధ్య ధైర్యం చేశారు.. ‘మహా’ మంత్రిపై గవర్నర్ ప్రశంసలు..

ABN, First Publish Date - 2020-11-04T04:19:01+05:30

కరోనా కల్లోలం సమయంలో ధైర్యం చేసి హెల్త్ సైన్స్ యూనివర్సిటీ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించిన మహారాష్ట్ర మంత్రి అమిత్ దేశ్‌ముఖ్‌పై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాశిక్: కరోనా కల్లోలం సమయంలో ధైర్యం చేసి హెల్త్ సైన్స్ యూనివర్సిటీ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించిన మహారాష్ట్ర మంత్రి అమిత్ దేశ్‌ముఖ్‌పై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ (ఎంయూహెచ్ఎస్) లోని మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఛగన్ భుజ్‌బల్, వైద్యవిద్యామంత్రి దేశ్‌ముక్, ఎంయూహెచ్‌ఎస్ వీసీ డాక్టర్ దిలీప్ మైసేకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ‘‘పరీక్షా సమయాల్లో, క్లిష్ట. పరిస్థితుల్లో, యుద్ధ సమయంలో నాయకుడి అసలైన సామర్థ్యం ఏమిటో బయటపడుతుంది. మన యువమంత్రి అమిత్ దేశ్‌ముఖ్.. ధైర్యం, తెలివి, దార్శనికతను నిరూపించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని బట్టి పరీక్షలు నిర్వహించే అవకాశమే లేదని అంతా అనుకునే పరిస్థితి. అలాంటి సమయంలో ధైర్యం చేసిన దేశ్‌ముఖ్‌ను పొగిడేందుకు మాటలు చాలవు..’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వల్ల ఎదురయ్యే అన్ని ప్రమాదాలను ఎదుర్కోవచ్చని కూడా గవర్నర్ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-04T04:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising