ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌పీ స్కామ్: మీడియా దర్యాప్తును ఆపాలంటూ హైకోర్టుకు మహా సర్కారు వినతి

ABN, First Publish Date - 2020-11-26T01:22:30+05:30

టీఆర్‌పీ రిగ్గింగ్ కేసులో రిపబ్లిక్ టీవీ సహా ఇతర న్యూస్ ఛానెళ్లు చేస్తున్న ‘‘సమాంతర దర్యాప్తు’’ను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టీఆర్‌పీ రిగ్గింగ్ కేసులో రిపబ్లిక్ టీవీ సహా ఇతర న్యూస్ ఛానెళ్లు చేస్తున్న ‘‘సమాంతర దర్యాప్తు’’ను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బోంబే హైకోర్టును కోరింది. అయితే ప్రస్తుత దశలో ఈ కేసుపై రిపోర్టింగ్ చేయొద్దంటూ తాము ఆదేశాలు జారీ చేయలేమని జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ... ఈ కేసు విచారణలో ఉండగా వార్తా ఛానెళ్లు పలువురు సాక్షులను పిలిపిస్తూ, వారితో ప్రకటనలు ఇప్పిస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఓ వైపు టీఆర్‌పీ స్కామ్ కేసులో ముంబై పోలీసులు జరుపుతున్న విచారణపై స్టే విధించాలంటూ రిపబ్లిక్ ఛానెల్ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరుపుతుండగా.. అదే ధర్మాసనానికి కపిల్ సిబల్ ‘‘సమాంతర దర్యాప్తు’’ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా రిపబ్లిక్ టీవీ యాజమాన్య సంస్థ ఏఆర్‌జీ అవుట్‌లియర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్‌లో కోరింది. 


Updated Date - 2020-11-26T01:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising