ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను ఓడించిన 106 ఏళ్ల వృద్ధురాలు

ABN, First Publish Date - 2020-09-21T12:51:25+05:30

మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో 106 ఏళ్ల వృద్ధురాలు కోవిడ్-19ను ఓడించారు. వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న ఆ బామ్మకు ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది అత్యంత ఘనంగా వీడ్కోలు పలుకుతూ, ఇంటికి పంపించారు. ఆసుపత్రిలో 10 రోజుల పాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఠాణె: మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో 106 ఏళ్ల వృద్ధురాలు కోవిడ్-19ను ఓడించారు. వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న ఆ బామ్మకు ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది అత్యంత ఘనంగా వీడ్కోలు పలుకుతూ, ఇంటికి పంపించారు. ఆసుపత్రిలో 10 రోజుల పాటు చికిత్స పొందిన ఆ వృద్ధురాలు అత్యంత ఆనందంగా తన డిశ్చార్జ్ షీటును మీడియాకు చూపించారు. ఆ వృద్ధురాలి కోడలు మీడియాతో మాట్లాడుతూ డోంబివలీనివాసి అయిన తన అత్త కరోనా బారిన పడగా, ఆమె వయసును చూసి, ఏ ఆసుపత్రిలోనూ అడ్మిట్ చేసుకోలేదన్నారు. 


ఎంతో ప్రయత్నించిన మీదట 10 రోజుల క్రితం కణ్యాణ్ డోంబివలీ నగర్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నారన్నారు. అక్కడి వైద్యబృందం తన అత్తకు తగిన చికిత్స అందించారన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాహుల్ థులే మాట్లాడుతూ ఆ బాధిత వృద్దురాలికి చికిత్స అందించేందుకు తమ వైద్యబృందం ఎంతో కృషి చేసిందన్నారు. జూలై 27న ఈ ఆసుపత్రి ప్రారంభమయ్యిదని, ఇప్పటివరకూ 1,100 మందికి చికిత్స అందించామని తెలిపారు. కాగా కరోనా బారిన పడిన ఆ వృద్ధురాలికి వైద్యం అందించి, ఆమె కోలుకునేందుకు సహకరించిన వైద్యులకు మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా అభినందనలు తెలిపారు.  

Updated Date - 2020-09-21T12:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising