ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలకడగా నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం..

ABN, First Publish Date - 2020-11-29T03:23:58+05:30

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని లక్నోలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని లక్నోలోని మేదాంత ఆస్పత్రి ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని వెల్లడించింది. ఈ మేరకు శనివారం మేదాంత ఆస్పత్రి ఓ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. గుండెకు రక్తాన్ని చేరవేసే ఓ సిరలో రక్తం గడ్డకట్టడం వల్ల... థ్రాంబోఎంబాలిజంతో బాధపడుతున్న దాస్‌కు ప్రస్తుతం మేదాంత వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ‘‘ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా, సంతృప్తిగా ఉంది. క్రిటికల్ కేర్ నిపుణుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స జరుగుతోంది..’’ అని హెల్త్ బులిటిన్‌లో పేర్కొన్నారు. ఊపిరిపీల్చుకోవడం కష్టంగా ఉందంటూ దాస్ పేర్కొనడంతో ఈ నెల 9న ఆయనను అయోధ్యలోని శ్రీరాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి ‘‘సీరియస్’’గా మారడంతో వైద్యుల సూచనల మేరకు లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు.

Updated Date - 2020-11-29T03:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising