ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ మహానాడు’లో పాల్గొన్నవాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రండి

ABN, First Publish Date - 2020-04-01T15:14:06+05:30

‘ మహానాడు’లో పాల్గొన్నవాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై,(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ నిజాముద్దీన్‌ మహానాడులో పాల్గొన్నవాళ్లు సామాజిక బాధ్యత గుర్తించి స్వచ్ఛందం గా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా తమ కుటుంబీకులు, ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలుగుతారని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో మూడొంతులు ఢిల్లీ మహానాడులో పాల్గొనవారే కావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మహానాడులో పాల్గొన్నవారిలో ఆచూకీ తెలియనివారి కోసం ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన చేస్తూ.. ‘‘ఢిల్లీ నిజాముద్దీన్‌లో ఉన్న తప్లికి జమాత్‌ మర్కజ్‌లో జరిగిన మహానాడులో తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికిపైగా పాల్గొన్నట్లు గుర్తించాం. వీరిలో అనేకమంది మహానాడు పూర్తవగానే రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించాం. మహానాడు లో పాల్గొన్న కొందరిని జిల్లా యంత్రాంగాలు గుర్తించగలిగాయి. ఆచూకీ తెలియనివారు తమకు తాముగా ముందుకు వచ్చి జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరుతున్నాం. వారందరూ సకాలంలో చికిత్సలో పొందితే వారి కుటుంబీకులకు, ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలుగుతాము. కాబట్టి, జమాత్‌లో పాల్గొన్నవాళ్లు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరుతున్నాం’’ అని పేర్కొంది.

Updated Date - 2020-04-01T15:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising