ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులకు మాస్క్‌లు, శానిటైజర్లు పంచిన హోం మంత్రి

ABN, First Publish Date - 2020-04-05T00:47:17+05:30

కోవిడ్-19 వైరస్ వేగంగా విస్తరిస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకుని విధి నిర్వహణలో ఉన్న ముంబై పోలీసు సిబ్బందికి మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కోవిడ్-19 వైరస్ వేగంగా విస్తరిస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకుని విధి నిర్వహణలో ఉన్న ముంబై పోలీసు సిబ్బందికి మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ శనివారంనాడు మాస్క్‌లు, శానిటైజర్లు పంచారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో అహరహం శ్రమిస్తున్న పోలీసు సిబ్బందిని కాపాడుకోవడం తమ కర్తవ్యమని, వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వ్యక్తిగత రక్షణా సామగ్రిని (పీపీఈ) అందజేశామని హోం మంత్రి తెలిపారు.


రాష్ట్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం, మహారాష్ట్రలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 537కు చేరింది. కొత్తగా నమోదైన 47 కేసుల్లో ముంబై నుంచి 28, థానే జిల్లా నుంచి 15, పుణె నుంచి రెండు, అమ్రావతి, పింప్రి చించ్వాడ్ నుంచి చెరో కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా 61 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,902కు చేరుకుంది.

Updated Date - 2020-04-05T00:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising