ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డాన్‌’ స్టాంపుల జారీలో నిందితులెవరు?

ABN, First Publish Date - 2020-12-30T08:13:21+05:30

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మాఫియా డాన్‌ల ముఖచిత్రాలతో స్టాంపులు ముద్రితమవడం పట్ల స్థానిక పోస్టల్‌ శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్‌ పోస్టల్‌ శాఖ విచారణ

బ్రాంచి ఇన్‌చార్జి సస్పెన్షన్‌


న్యూఢిల్లీ, డిసెంబరు 29: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మాఫియా డాన్‌ల ముఖచిత్రాలతో స్టాంపులు ముద్రితమవడం పట్ల స్థానిక పోస్టల్‌ శాఖ విచారణకు ఆదేశించింది. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. బ్రాంచి ఇన్‌చార్జి రజ్‌నీశ్‌ కుమార్‌ను విధుల నుంచి తప్పించామని వెల్లడించింది. చోటా రాజన్‌, మున్నా బజ్‌రంగీల ఫొటోలతో ముద్రితమైన 12 స్టాంపులు సోమవారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వినియోగదారులు తమ సొంత ఫొటోతోనే స్టాంపును ముద్రించుకునే అవకాశాన్ని కల్పిస్తూ.. కొన్నేళ్ల క్రితం తపాలా శాఖ ‘మై స్టాంప్‌’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం వినియోగించుకోవాలంటే.. స్టాంపుపై ముద్రించే ఫొటోలు చట్టవిరుద్ధమైనవి కావని, సమాజంలోని విలువలపై దుష్ప్రభావం చూపించేవి కాదని, దేశభక్తికి విరుద్ధం కాదని హామీ ఇస్తూ ఒక డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే.. తాజా ఘటనలో నిందితులు ఎటువంటి డిక్లరేషన్‌నూ సమర్పించలేదని తెలుస్తోంది.

Updated Date - 2020-12-30T08:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising