ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదర్సాలపై మధ్యప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-10-21T14:53:34+05:30

మదర్సాలపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఉషాఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్ (మధ్యప్రదేశ్): మదర్సాలపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఉషాఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీరును టెర్రర్ ఫ్యాక్టరీగా మార్చడానికి మదర్సాలే కారణమని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఉషాఠాకూర్ ఆరోపించారు. అందువల్ల మదర్సాలకు ప్రభుత్వ సహకారం ఇవ్వకూడదని మంత్రి కోరారు.‘‘ఉగ్రవాదులందరూ మదర్సాల్లో పెరిగారు, వారు జమ్మూ కాశ్మీర్‌ను టెర్రర్ ఫ్యాక్టరీగా మార్చారు. మదర్సాలు పాటించలేని జాతీయత, సమాజం పురోగతిని నిర్ధారించడానికి వాటిని ప్రస్తుత విద్యావ్యవస్థలో విలీనం చేయాలి’’ అని మధ్యప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి శాఖ మంత్రి ఉషా డిమాండు చేశారు.


అసోంలో మదర్సాలను మూసివేశారని, అలాగే జాతీయ ప్రయోజనాల కోసం మధ్యప్రదేశ్ లోనూ మూసివేయాలని మంత్రి కోరారు. మదర్సాలకు ప్రభుత్వం నిధులను నిలిపివేయాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.‘‘రాజ్యాంగ స్ఫూర్తితో మత విద్యను ప్రోత్సహించడానికి ఇటువంటి సంస్థలను వ్యక్తిగత సామర్థ్యంతో నడిపించడానికి వక్ఫ్ బోర్డు బలంగా ఉంది. మదర్సాలకు ప్రభుత్వ సహకారం అంతం కావాలి’’ అని ఆమె కోరారు.మతం ఆధారిత విద్య సమాజంలో ద్వేషాన్ని ప్రోత్సహిస్తుందని మంత్రి చెప్పారు.

Updated Date - 2020-10-21T14:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising