ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మంగళసూత్రం కూడా బలవంతంగా తొలగిస్తారా?’

ABN, First Publish Date - 2020-10-01T17:14:45+05:30

మహిళలు ప్రాణపదంగా భావించే మంగళసూత్రం, కాలి మట్టెలను కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నీట్‌’ నిబంధనకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌

చెన్నై : ‘నీట్‌’ నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వైద్యకోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయి ‘నీట్‌’ పరీక్ష ఇటీవల జరిగింది. ఈ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు కఠిన నిబంధనలు అమలుచేశారు. పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోనే పెన్ను ఇస్తారు. విద్యార్థులు పెన్ను, పెన్సిల్‌, రబ్బర్‌, స్కేల్‌, కాలిక్యులేటర్‌ తదితర పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్తేందుకు అనుమతి లేదు. 


అలాగే, సెల్‌ఫోన్‌, బ్లూటూత్‌, పెన్‌ డ్రైవ్‌, చేతి గడియారం, ల్యాప్‌టాప్‌, కెమెరా తదితరాలను కూడా అనుమతించరు. సాఫ్ట్‌ కలర్‌ దుస్తులనే విద్యార్థులు ధరించాలి, టీ-షర్ట్‌లు వేసుకోకూడదు. ముఖ్యంగా, మహిళలు ప్రాణపదంగా భావించే మంగళసూత్రం, కాలి మట్టెలను కూడా అధికారులు బలవంతంగా తీయించారు. ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టులో దాఖలైన ప్రజావ్యాజ్యంలో... వివాహమైన మహిళలు పరీక్ష రాసేందుకు వచ్చిన సమయంలో మంగళసూత్రం, కాలి మట్టెలు బలవంతంగా తొలగించడం రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు.


పరీక్షలకు హాజరయ్యే విద్యా ర్థులు ధరించిన ఆభరణాలు తొలగించాలని ఒత్తిడి చేయరాదు. సీసీ కెమె రాలు ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఇలాంటి నిర్భంధ నిబంధనలు చట్టవ్యతి రేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిబందనలు చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్‌ త్వరలో విచారణకు రానుంది.

Updated Date - 2020-10-01T17:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising