ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బర్త్‌డేకు బెంజ్ కారు గిఫ్ట్.. పీఏకు సర్‌ప్రైజ్!

ABN, First Publish Date - 2020-02-15T01:45:50+05:30

ప్రముఖ సింగర్ మాడిసన్ బీర్ తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) పుట్టిన రోజు సందర్భంగా మెర్సిడస్ బెంజ్ కారును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్‌ఏంజిల్స్: ప్రముఖ సింగర్ మాడిసన్ బీర్ తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) పుట్టిన రోజు సందర్భంగా మెర్సిడస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చి పెద్ద మనసు చాటుకుంది. తన అభ్యున్నతి కోసం నిత్యం కృషి చేస్తున్న సదరు సహాయకురాలికి కొండంత సంతోషాన్ని పంచిపెట్టింది. లాస్‌ఏంజిల్స్ వేదికగా సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా పీఏ పుట్టిన రోజున ఆభరణాలో, మరేదైనా వస్తువులో ఆశించగలమనీ.. కానీ బాస్ నుంచి ఏకంగా ఖరీదైన కార్ గిఫ్ట్ వస్తుందని అస్సలు ఊహించలేమని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


తన పీఏ 30వ పుట్టిన రోజు సందర్భంగా కొందరు మిత్రులతో కలిసి గ్రాండ్‌గా డిన్నర్ ఏర్పాటు చేసిన మాడిసన్ బీర్... డిన్నర్ అయిపోయిన తర్వాత ఆమె చేతిలో ఓ బ్యాగ్ పెట్టింది. అది కాళీగా కనిపించడంతో ఏమీ అర్థం కాలేదన్నట్టు ఆమె తన యజమాని వైపు చూసింది. అంతలో మాడిసన్ ఓ తాళం ఆమె చేతిలో పెట్టి ‘‘ఇదే నీ బర్త్‌డే గిఫ్ట్ అంటూ’’ పేర్కొంది. రోడ్డుపై తన కోసం నిలిపి ఉంచిన 50 వేల డాలర్ల విలువైన మెర్సిడెస్‌ బెంజ్‌ సీ 300 కారును చూసి పీఏ నోట మాటరాలేదు. సంతోషంగా తన యజమానిని ఆలింగనం చేసుకుని పదే పదే కృతజ్ఞతలు చెప్పినట్టు వీడియోలో కనిపిస్తోంది. కాగా తన పీఏకి బెంజ్ కారు అంటే ఇష్టమనీ... అయినా బడ్జెట్ సరిపోక 12 ఏళ్ల పాత కారుతోనే ఆమె సర్దుకుపోతోందని సింగర్ మాడిసన్ తెలుసుకుని మరీ ఇలా ఔదార్యం చాటుకోవడం విశేషం. 20 ఏళ్ల మాడిసన్‌ తన 13 ఏట నుంచే మంచి గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి యూట్యూబ్‌ వీడియోలు ఆమెకు పెద్ద ఎత్తున పాపులారిటీ తెచ్చిపెట్టాయి. 

Updated Date - 2020-02-15T01:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising