ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరీక్షల్లో శాంపిల్ ఇవ్వకుండానే 15 మందికి పాజిటివ్ రిపోర్టు!

ABN, First Publish Date - 2020-09-17T17:15:11+05:30

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోగల నిమర్‌పూర్ ఆరోగ్యకేంద్రానికి చెందిన వైద్యబృందం వివిధ గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహించింది. టానా గ్రామానికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వెళ్లిన ఆశా వర్కర్లు అక్కడి పంచాయతీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధార్: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోగల నిమర్‌పూర్ ఆరోగ్యకేంద్రానికి చెందిన వైద్యబృందం వివిధ గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహించింది. టానా గ్రామానికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వెళ్లిన ఆశా వర్కర్లు అక్కడి పంచాయతీ కార్యాయంలోని జనగణన రిజిస్ట్రర్‌లోని 19 మంది పేర్లను రాసుకుని, వైద్య పరీక్షల కోసం గ్రామస్తులంతా రావాలని కబురంపారు. అయితే గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తూ, శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. 



దీంతో సర్పంచ్ ముందుకొచ్చి గ్రామానికి చెందిన నలుగురి నుంచి శాంపిల్ ఇప్పించారు. తరువాత ఆశా వర్కర్లు తాము అంతకుముందు రాసుకున్న పేర్లతో ఏదోవిధంగా శాంపిల్స్ సిద్ధం చేసి, వాటిని ఇండోర్‌లోని ల్యాబ్‌కు పంపించారు. మర్నాడు గ్రామానికి చెందిన 15 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. ఈ 15 మంది కరోనా పరీక్షల కోసం శాంపిల్ ఇవ్వనేలేదు. దీంతో వీరంతా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. 

Updated Date - 2020-09-17T17:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising