ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్నోలో అధునాతన వైద్యసౌకర్యాలతో కేన్సర్ ఆసుపత్రి

ABN, First Publish Date - 2020-09-26T11:53:35+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన లక్నోలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అమలుతోపాటు అధునాతన వైద్యసౌకర్యాలతో కొత్తగా కేన్సర్ ఆసుపత్రిని త్వరలో ప్రారంభించనున్నట్లు ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన లక్నోలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అమలుతోపాటు అధునాతన వైద్యసౌకర్యాలతో కొత్తగా కేన్సర్ ఆసుపత్రిని త్వరలో ప్రారంభించనున్నట్లు యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ వెల్లడించారు. లక్నో నగరంలో కేన్సర్ ఆసుపత్రి, ఫ్లై ఓవర్లను త్వరలో ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తారని సీఎం పేర్కొన్నారు. లక్నో, హర్దీయ్, లఖింపూర్ ఖేరి, రాయబరేలీ, సీతాపూర్, ఉన్నవో ప్రాంతాల్లో అభివృద్ధి పనుల గురించి సీఎం వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. 


ఈ అభివృద్ధి సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, జలశక్తి మంత్రి మహేంద్రసింగ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యూపీలోని గ్రామాల్లో రక్షితమంచినీటి పథకాల నిర్మాణం చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేదాకా ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని సీఎం కోరారు.

Updated Date - 2020-09-26T11:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising