ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13 న‌గరాల్లోనే లాక్‌డౌన్ 5.0... మిగిలిన చోట్ల తెరుచుకోనున్న హోట‌ళ్లు, మాల్స్‌?

ABN, First Publish Date - 2020-05-30T14:13:55+05:30

లాక్‌డౌన్‌ 4.0 ముగుస్తున్న త‌రుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలపై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌ధ్యంలో జూన్ 1 నుండి దేశంలోని చాలా ప్రాంతాల‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఎత్తివేయ‌నున్న‌ట్లు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 ముగుస్తున్న త‌రుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలపై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌ధ్యంలో జూన్ 1 నుండి దేశంలోని చాలా ప్రాంతాల‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఎత్తివేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దేశంలోని 13 నగరాలు మినహా మిగతా అన్నిచోట్లా ఆంక్షలను ఎత్తివేయ‌వ‌చ్చ‌ని సమాచారం. హోటళ్ళు, మాల్స్, రెస్టారెంట్ల‌ను కూడా జూన్ 1 నుండి తెరవడానికి అనుమతినిస్తార‌ని భోగ‌ట్టా. కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూత‌నంగా రూపొందించిన‌ మార్గదర్శకాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణే, హైదరాబాద్, కోల్‌కతా, హౌరా, ఇండోర్, జైపూర్, జోధ్‌పూర్, చెంగల్‌పట్టు, తిరువల్లూరు నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను కొంత‌కాలం కొన‌సాగించ‌నున్నారు. మిగిలిన ప్రాంతాల్లో జూన్ 1 నుండి హోటళ్ళు, మాల్స్, రెస్టారెంట్లు  తెరవడానికి అనుమతి ల‌భించ‌వ‌చ్చు. అయితే ద‌శ‌ల‌వారీగా వీటికి అనుమ‌తులు ల‌భించ‌నున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్న‌ది. ఆదివారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మంలో లాక్‌డౌన్ 5.0కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించనున్నార‌ని స‌మాచారం. 

Updated Date - 2020-05-30T14:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising