ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ కొనసాగింపుపై ఆలోచిస్తాం: సోరెన్

ABN, First Publish Date - 2020-04-10T23:32:12+05:30

ఇతర రాష్ట్రాల పరిస్థితికి భిన్నంగా జార్ఖండ్‌లో పరిస్థితి ఉందని, ఏడు లక్షలకు పైగా కార్మికులు ఇతర రాష్ట్రాల్లో నిలిచిపోయారని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: జార్ఖండ్‌లో కరోనా వైరస్ పరిస్థితిని బట్టే లాక్‌డౌన్‌ను పొడిగించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తెలిపారు. కోవిడ్ సంక్షోభంపై శుక్రవారంనాడు అఖిల పక్ష సమావేశం నిర్వహించిన సొరేన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల పరిస్థితికి భిన్నంగా జార్ఖండ్‌లో పరిస్థితి ఉందని, ఏడు లక్షలకు పైగా కార్మికులు ఇతర రాష్ట్రాల్లో నిలిచిపోయారని ఆయన చెప్పారు. వారి పరిస్థితిని కూడా తాము దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు.


కరోనాపై పోరాటానికి కేంద్రం తమకు మరింత సహాయం అందించాలని సోరెన్ కోరారు. కోవిడ్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని వాతావరణాన్ని కలుషితం చేసేందుకు సంఘ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలకు వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించారు. కాగా, జార్ఖాండ్‌లో ఇంతవరకూ 13 కోవిడ్-19 పాసిటివ్ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-10T23:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising