ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసుల సంఖ్యపై లాక్ డౌన్ ప్రభావం తక్కువే: ఎయిమ్స్ డైరెక్టర్

ABN, First Publish Date - 2020-06-07T18:42:11+05:30

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇంకా పీక్‌కు(పతాకస్తాయికి) చేరుకోలేదని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెన్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇంకా పీక్‌కు(పతాకస్థాయికి) చేరుకోలేదని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెన్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో సమయంలో ఈ స్థాయికి చేరకుంటుందని తెలిపారు.


నిపుణులు అభిప్రాయం ప్రకారం.. వ్యాధి వ్యాప్తిలో భాగంగా రోగుల సంఖ్య ఓకానొక సమయంలో పతాకస్థాయికి(పీక్) చేరుకుని ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పడతాయి. అయితే వ్యాధి ఇలా నెమ్మదించేందుకు ప్రభుత్వం పటిష్ట రక్షణ చర్యలు కూడా చేపట్టవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


‘భారత్‌లో కేసుల సంఖ్య ఇంకా పీక్‌కు చేరుకోలేదు. ప్రస్తుతం ఇక్కడ కేసులు పెరుగుతున్నప్పటికీ దేశ జనాభాను పరిగణలోకి తీసుకుంటే ఇది అసాధారణమేమీ కాదు. ఈ అంశంలో భారత్‌ను ఇతర ఐరోపా దేశాలతో పోల్చకూడదు. భారత జనాభా అక్కడి రెండు మూడు దేశాలతో సమానం’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.


ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో సామాజిక వ్యాప్తికి సంబంధించిన భయాలపై కూడా రణదీప్ స్పందించారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో ప్రాంతీయ స్థాయిలోనే ఈ పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. లాక్ డౌన్ ప్రభావంపై కూడా వ్యాఖ్యానించిన ఆయన..ఇది కొంత మేర ప్రభావం చూపినప్పటికీ.. కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకోలేదని జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటరవ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-06-07T18:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising