ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోం శాఖ ఫేస్‌బుక్‌ పేజీలో విస్కీ బాటిళ్లు

ABN, First Publish Date - 2020-05-29T06:41:34+05:30

ఒక జూనియర్‌ ఉద్యోగి పొరపాటుగా చేసిన పోస్ట్‌ కారణంగా గురువారం కేంద్ర హోం శాఖ ఫేస్‌ బుక్‌పై రెండు విస్కీ బాటిళ్లు, కొన్ని స్నాక్‌లతో కూడిన ఫొటోలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జూనియర్‌ ఉద్యోగి పొరపాటు
  • పర్సనల్‌ పేజీ బదులు హోం శాఖ పేజీలో పోస్ట్‌

న్యూఢిల్లీ మే 28: ఒక జూనియర్‌ ఉద్యోగి పొరపాటుగా చేసిన పోస్ట్‌ కారణంగా గురువారం కేంద్ర హోం శాఖ ఫేస్‌ బుక్‌పై రెండు విస్కీ బాటిళ్లు, కొన్ని స్నాక్‌లతో కూడిన ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. తుఫాన్‌తో ప్రభావితమైన పశ్చిమ బెంగాల్‌లో చేపట్టిన సహాయ చర్యలకు సంబంధించిన విభాగంలో ఈ ఫొటోలు కనిపించాయి. ఇవి సుమారు 15 నిమిషాలపాటు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. కొంతమంది నెటిజన్లు ఈ పోస్ట్‌  కింద  ఫేస్‌బుక్‌లో తమదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. ‘‘ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి ఇదే రుజువు’’ అని ఒక ఫేస్‌బుక్‌ యూజర్‌ పేర్కొన్నాడు. 


హోం శాఖ ఫేస్‌బుక్‌ పేజీ బాధ్యతలను చూసే ఒక జూనియర్‌ ఉద్యోగి పర్సనల్‌ పేజీలో పోస్ట్‌ చేయబోయి పొరపాటున ఆ ఫొటోలను హోం శాఖ పేజీలో అప్‌లోడ్‌ చేయడం గందరగోళానికి కారణమైంది. ఈ ఘటనపై హోం శాఖ స్పందించింది. ఫోటోలను ఉదయం 9.32 గంటలకు తొలగించినట్లు పేర్కొంది. సదరు ఉద్యోగి లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాడని ప్రకటించింది. 


Updated Date - 2020-05-29T06:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising