ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్లో నగదు లభ్యత పెంచాలి : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ABN, First Publish Date - 2020-06-16T21:19:39+05:30

మార్కెట్లో కార్యకలాపాలను, నగదు లభ్యతను పెంచకపోతే ఆర్థిక వ్యవస్థ వేగం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మార్కెట్లో కార్యకలాపాలను, నగదు లభ్యతను పెంచకపోతే ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కోవిడ్-19 అనంతర ప్రపంచంలో సూక్ష్మ,  చిన్న తరహా, మధ్య తరహా సంస్థలు, మౌలిక సదుపాయాలు - అభివృద్ధికి బాటలు వేయడం అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 


బ్యాంకులు, డిమాండ్-సప్లయ్, నగదు లభ్యతకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని గడ్కరీ అంగీకరించారు.  ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో చాలా ముఖ్యమైన సమస్య నగదు లభ్యత అని తెలిపారు. మార్కెట్లో కార్యకలాపాలను భారీగా పెంచవలసి ఉందన్నారు. ద్రవ్య లభ్యత లేకపోతే ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకునే అవకాశం ఉండదని చెప్పారు. 


ఇదే సమయంలో మనం ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. దీనిని ఎదుర్కొంటున్నది భారత దేశం ఒక్కటే కాదని, యావత్తు ప్రపంచం ఇదే సమస్యతో సతమతమవుతోందని చెప్పారు. 


వ్యవసాయ రంగం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడానికే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2020-06-16T21:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising