ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌ తరహాలోనే మతం వైరస్‌ కూడా ఉంది: ఉద్ధవ్

ABN, First Publish Date - 2020-04-04T23:29:06+05:30

'కోవిడ్-19 తరహాలోనే కమ్యూనల్ వైరస్‌‌ ఒకటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. అయితే, దీనిపై ప్రజలను తప్పుదారి పట్టించేలా మెసేజ్‌లు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: 'కోవిడ్-19 తరహాలోనే కమ్యూనల్ వైరస్‌‌ ఒకటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. అయితే, దీనిపై ప్రజలను తప్పుదారి పట్టించేలా మెసేజ్‌లు ఇచ్చినా, కేవలం నవ్వులాట కోసమని చెప్పి ఆ తరహా వీడియోలు పోస్ట్ చేసినా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.


శనివారంనాడిక్కడ మీడియాతో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ 'ఢిల్లీలో ఏదైతే జరిగిందో దానిని మహారాష్ట్రలో పునరావృతం కానీయం. దానికి (తబ్లీగి జమాత్ ఈవెంట్) ఇంతకుముందు అనుమతి ఇచ్చాం. ఆ తర్వాత పరిస్థితికి అనుగుణంగా ఆ అనుమతి ఉపసంహరించాం. రాష్ట్రం నుంచి ఢిల్లీ ఈవెంట్‌కు వెళ్లిన వారందరి జాడను అధికారులు గుర్తించారు' అని ఆయన తెలిపారు. కోవిడ్-19 వైరస్‌ వ్యవహారంతో మతానికి ముడిపెట్టవద్దని ఆయన స్పష్టం చేశారు.


బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ సహా, పలు హోటళ్ల యాజమాన్యాలు సహాయం చేసేందుకు సీఎం కార్యాలయాన్ని సంప్రదించారని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఎలాంటి ఈవెంట్లు కానీ, ప్రజలంతా ఒకచోటకు చేరే కార్యక్రమాలకు కానీ అనుమతి ఉండదని ఆయన ప్రకటించారు. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందా లేదా అని తెలుసుకున్న తర్వాతే 14 వరకూ ఉన్న లాక్‌డౌన్‌ కొనసాగించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని థాకరే తెలిపారు.

Updated Date - 2020-04-04T23:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising