ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్

ABN, First Publish Date - 2020-07-10T11:21:24+05:30

లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని జమ్మూకశ్మీర్ లోని బండిపొరాలో భద్రతా జవాన్లు అరెస్టు చేశారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండిపొరా (జమ్మూకశ్మీర్): లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని జమ్మూకశ్మీర్ లోని బండిపొరాలో భద్రతా జవాన్లు అరెస్టు చేశారు. బండిపొరా ప్రాంతం హాజిన్ పట్టణంలోని హాజబరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేర బండిపొరా పోలీసులు, 13 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ 45 బెటాలియన్ కు చెందిన జవాన్లు గాలింపు చేపట్టారు. గాలిస్తున్న జవాన్లపై లష్కరే తోయిబాకు చెందిన రఫీఖ్ అహ్మద్ గ్రెనెడ్ విసిరేందుకు యత్నించాడు. దీంతో జవాన్లు అతన్ని అరెస్టు చేశారు. ఉగ్రవాది నుంచి లైవ్ గ్రెనెడ్లు, మందుగుండు సామాగ్రి, ఏకే 47 తుపాకీ తూటాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాది రఫీఖ్ ఇటీవల ఉగ్రవాద సంస్థలో చేరాడని, అతనికి గ్రెనెడ్లు ఇచ్చి జవాన్లపై వేయాలని లక్ష్యంగా పెట్టారని ఆర్మీ జవాన్ల దర్యాప్తులో తేలింది.

Updated Date - 2020-07-10T11:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising