ఢిల్లీ, పంజాబ్, కేరళలో కరోనా సెకెండ్ వేవ్... దీపావళినాటికి మరింత వ్యాప్తి!
ABN, First Publish Date - 2020-10-01T17:24:50+05:30
దేశంలో ఈరోజు నుంచి అన్‌లాక్-5 ప్రకియ ప్రారంభమయ్యింది. ఈసారి 50 శాతం ప్రేక్షకులతో సినిమాహాళ్లు తెరిచేందుకు అనుమతినిచ్చారు. ఇదిలావుండగా ప్రస్తుతం దేశంలోని కేరళ, పంజాబ్, ఢిల్లీలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో ఈరోజు నుంచి అన్‌లాక్-5 ప్రకియ ప్రారంభమయ్యింది. ఈసారి 50 శాతం ప్రేక్షకులతో సినిమాహాళ్లు తెరిచేందుకు అనుమతినిచ్చారు. ఇదిలావుండగా ప్రస్తుతం దేశంలోని కేరళ, పంజాబ్, ఢిల్లీలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. దీనిని కరోనా సెకెండ్ వేవ్‌కు సంకేతంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రాబోయే పండుగల సందర్బంగా కరోనా ముప్పు మరింతగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో కరోనా మొదటి వేవ్ జూన్‌లో కనిపించింది. అప్పుడు రోజుకు 3,000 కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. జూలై ఆఖరునాటికి కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ సమయంలో రోజులకు వెయ్యి కేసులు నమోదయ్యాయి. ఆగస్టు మధ్యనాటికి ఢిల్లీలో తిరిగి కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
సెప్టెంబరు 9న ఢిల్లీలో అత్యధికంగా ఒక్కరోజులో 4,039 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాల ప్రకారం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2.5 లక్షలను దాటింది. కొత్తగా మరో 3,827 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేవిధంగా కేరళలో కూడా కొత్తగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సెప్టెంబరు మొదటివారంలో కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే సెప్టెంబరు చివరినాటికి కొత్తగా రాష్ట్రంలో 5,898 కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశంగా మారింది. ఇక పంజాబ్‌లోని లుథియానా, జలంధర్, మోహాలీ, అమృత్‌సర్. పటియాలా ప్రాంతాలలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి.
Updated Date - 2020-10-01T17:24:50+05:30 IST