ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కట్-కాపీ- పేస్ట్’ ఆవిష్కర్త కన్నుమూత!

ABN, First Publish Date - 2020-02-20T17:14:50+05:30

‘కట్- కాపీ- పేస్ట్’ ఈ మూడూ లేకుండా కంప్యూటర్‌లో ఏ పనీ చేయలేమనే విషయం విదితమే. ఈ ‘కట్- కాపీ- పేస్ట్’ ఆవిష్కర్త అయిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కట్- కాపీ- పేస్ట్’ ఈ మూడూ లేకుండా కంప్యూటర్‌లో ఏ పనీ చేయలేమనే విషయం విదితమే. ఈ ‘కట్- కాపీ- పేస్ట్’ ఆవిష్కర్త అయిన ‘లారీ టెస్లర్’ పర్సనల్ కంప్యూటర్ విప్లవకర్త అయిన స్టీవ్ జాబ్స్‌కు దక్కినంత ఆదరణ చూరగొనలేదు. అయితే టెస్లర్ అందించిన ‘కట్- కాపీ- పేస్ట్’ తదితర ఆవిష్కరణలు ఎంతగానో ఉపయుక్తమవుతున్నాయి. లారీ టెస్లర్(74) ఈరోజు కన్నుమూశారు. న్యూయార్క్‌లో జన్మించిన ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదివారు. 1973లో ఆయన జెరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. ‘కట్- కాపీ- పేస్ట్’ ఆవిష్కర్త ప్రయాణం ఇక్కడి నుంచి ప్రారంభమయ్యింది. టెస్లర్‌‌కు జెరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో టిమ్ మాట్ అనే కంప్యూటర్ నిపుణుని సహాయంతో జిప్సీ టెక్స్ట్ ఎడిటర్ తయారు చేశారు. దీనిని మరింతగా అభివృద్ధి పరచి ‘కట్- కాపీ- పేస్ట్’ ను రూపొందించారు. లారీ టెస్లర్‌ అమెజాన్, యూహూ తదితర ప్రముఖ సంస్థల్లోనూ పనిచేశారు. 


Updated Date - 2020-02-20T17:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising