ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయసును బట్టే మరణాలు: లాన్సెట్‌ సర్వే

ABN, First Publish Date - 2020-04-01T06:08:51+05:30

కరోనా వైర్‌సతో మృతుల రేటు 0.0016 నుంచి 7.8 శాతంగా ఉందని, వయసు ఆధారంగానే మృతులూ ఉన్నారని ‘ద లాన్సెట్‌ ఇన్ఫెక్టియస్‌ డిసీజెస్‌’ తాజా సర్వేలో తేల్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌ మార్చి 31: కరోనా వైర్‌సతో మృతుల రేటు 0.0016 నుంచి 7.8 శాతంగా ఉందని, వయసు ఆధారంగానే మృతులూ ఉన్నారని ‘ద లాన్సెట్‌ ఇన్ఫెక్టియస్‌ డిసీజెస్‌’ తాజా సర్వేలో తేల్చింది. ఇంతకు మునుపు ఈ రేటుని 0.2 నుంచి 1.6గా మాత్రమే అంచనా వేశారు. పాత అంచనాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని తెలిపింది. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ సహా వివిధ సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇంతవరకు జరిగిన సర్వేల్లో ఆసుపత్రి పాలైన వారి సంఖ్యను తీసుకోలేదు. చైనాలోని ఖరారు కాని కేసులనూ కలిపి మరణాల రేటు 0.66 శాతం. ఖరారైన కేసుల్లో మరణించిన వారి రేటు 1.38 శాతం. తొమ్మిదేళ్ళ లోపు పిల్లల్లో 0.0016 మరణాలు రేటు ఉండగా అదే 80 అంతకు మించి వయస్సు వారిని తీసుకుంటే ఇది 7.8 శాతంగా నమోదైంది. ఈ వివరాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు అంచనాల కంటే తక్కువగానే మరణాలు ఉన్నాయని తేల్చారు. 2009లో చోటుచేసుకున్న వైరస్‌ హెచ్‌1ఎన్‌1తో పోల్చుకుంటే కరోనా వైరస్‌తో మృతుల రేటే ఎక్కువని తెలిపారు. ప్రపంచంలో 50 నుంచి 80 శాతం ఈ వైరస్‌ బారిన పడవచ్చని, ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని శాస్త్రజ్ఞులు హెచ్చరించారు. మొట్టమొదట వైరస్‌ లక్షణాలను గుర్తించడం, మరణానికి మధ్య ఉన్న రోజులు 17.8 కాగా వ్యాధి నుంచి కోలుకునేందుకు పట్టేది 22.6 రోజులని అధ్యయనంలో తేలింది. 

Updated Date - 2020-04-01T06:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising