లాక్‌డౌన్‌పై కిషన్ రెడ్డి తాజా స్పందన
ABN, First Publish Date - 2020-04-08T19:10:02+05:30
దేశరాజధానిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయన్నారు.
ఢిల్లీ: లాక్‌డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశరాజధానిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయన్నారు. ప్రజలు లాక్‌డౌన్‌కి సహకరించాలని.. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాని తెలిపారు. నిత్యవసరాల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విపక్షాల సూచనలను స్వీకరిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.
Updated Date - 2020-04-08T19:10:02+05:30 IST