ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ కొరియాకు క్షమాపణ చెప్పిన కిమ్ జోంగ్ ఉన్

ABN, First Publish Date - 2020-09-26T01:30:23+05:30

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఓ దక్షిణ కొరియా వ్యక్తిని హత్య చేసినందుకు ఆ దేశానికి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సియోల్ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఓ దక్షిణ కొరియా వ్యక్తిని హత్య చేసినందుకు ఆ దేశానికి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణ చెప్పారు. ఈ విధంగా ఓ వ్యక్తిని కాల్చి చంపడంపై రాజకీయంగా, ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు సుహ్ హూన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 


ఉత్తర కొరియా సరిహద్దు దేశాలతో సంబంధాలను పర్యవేక్షిస్తున్న యునైటెడ్ ఫ్రంట్ డిపార్ట్‌మెంట్ నుంచి క్షమాపణ లేఖ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌కు అందినట్లు తెలిపారు. 


తమ దేశానికి చెందిన ఓ వ్యక్తిని ఉత్తర కొరియా సైనికులు కాల్చి చంపినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది. ఆ వ్యక్తి మృతదేహాన్ని పెట్రోలు పోసి తగులబెట్టారని పేర్కొంది. ఈ సంఘటనపై దక్షిణ కొరియాలో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. దేశాధ్యక్షుడు మూన్‌పై రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. 


ఈ సంఘటనపై వివరణ ఇవ్వాలని, మరోసారి ఇటువంటి సంఘటనలు జరగబోవని హామీ ఇవ్వాలని దక్షిణ కొరియా కోరినట్లు సుహ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం క్షమాపణ లేఖ రాసిందని చెప్పారు. 


ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని పెంచుకోవడానికి ఇటీవల జరుగుతున్న కృషికి ఈ సంఘటన ఆటంకం కాబోదనే ఆశాభావాన్ని ఉత్తర కొరియా వ్యక్తం చేసినట్లు సుహ్ తెలిపారు. మూన్, కిమ్ ఈ నెలలో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిపినట్లు చెప్పారు. 


Updated Date - 2020-09-26T01:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising