ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ కొరియాలో పిల్లల బడిబాట

ABN, First Publish Date - 2020-06-04T07:27:31+05:30

కరోనా ముప్పును అత్యంత సమర్థంగా ఎదుర్కొన్న దక్షిణ కొరియాలో పాఠశాలలను దశలవారీగా తెరుస్తున్నారు. ఒకవైపు కొత్త కేసులు నమోదవుతున్నా.. మే20న ఉన్నత పాఠశాలలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కొత్త కేసులు నమోదవుతున్నా పాఠాలు
  • పాక్‌లో ఒక్కరోజులో 4,132 కేసులు

న్యూఢిల్లీ, జూన్‌ 3: కరోనా ముప్పును అత్యంత సమర్థంగా ఎదుర్కొన్న దక్షిణ కొరియాలో పాఠశాలలను దశలవారీగా తెరుస్తున్నారు. ఒకవైపు కొత్త కేసులు నమోదవుతున్నా.. మే20న ఉన్నత పాఠశాలలను (హైస్కూ ల్స్‌) తెరిచారు. బుధవారానికి దాదాపు 18 లక్షల మంది పిల్లలు తరగతి గదుల్లో పాఠాలు వల్లెవేస్తున్నారు. బుధవారం ఆ దేశంలో 49 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కేసుల సంఖ్య 11,590కి చేరింది. అటు చైనాలో మళ్లీ కొత్తగా ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకినవారిలో నలుగురికి ఎలాంటి లక్షణాలూ కనిపించట్లేదని చైనా జాతీయ ఆరోగ్య సంగం తెలిపింది. మరొకరు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి అని వివరించింది. దీంతో చైనా కరోనా కేసుల సంఖ్య 83,021కి చేరింది. సింగపూర్‌లో కేసుల సంఖ్య 36 వేలు దాటగా.. పాక్‌లో ఒకేరోజు 4,132 కేసులు నమోదయ్యాయి. అక్కడ కేసుల సంఖ్య 80,463కు చేరింది. కాగా.. కొవిడ్‌-19 సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకోవడంలో చైనా ఆలస్యం చేసిందంటూ వచ్చిన వార్తలను ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి కొట్టిపారేశారు. 


Updated Date - 2020-06-04T07:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising