ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో రికార్డు స్థాయిలో నమోదైన కేసులు

ABN, First Publish Date - 2020-08-15T03:28:50+05:30

కేరళలో నేడు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,569 కొత్త కేసులు వెలుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళలో నేడు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,569 కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఒక రోజులో ఇన్ని కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 41,277కు పెరిగింది. కరోనా సోకిన వారిలో 27 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నట్టు ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. నేడు కొత్తగా 1304 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 26,996కు పెరిగినట్టు మంత్రి పేర్కొన్నారు. తాజా కేసుల్లో 1354 స్థానికంగా సంక్రమించినవి కాగా, 86 కేసుల మూలాలను గుర్తించాల్సి ఉందన్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండగా, వీరిలో 12,734 మంది వివిధ ఆసుపత్రులలోని ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు. ఇక, గత 24 గంటల్లో 31,738 శాంపిళ్లు పరీక్షించినట్టు ప్రభుత్వం తెలిపింది. 

Updated Date - 2020-08-15T03:28:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising