గర్భిణి నీటి కష్టాన్ని.. నిమిషాల్లో తీర్చిన ఎమ్మెల్యే, అగ్నిమాపక సిబ్బంది
ABN, First Publish Date - 2020-04-12T18:10:14+05:30
కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న క్రమంలో ‘బ్రేక్ ది చైన్’ అని సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన కేరళ ప్రభుత్వంపై సోషల్‌మీడియాలో ప్రశంసల
కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న క్రమంలో ‘బ్రేక్ ది చైన్’ అని సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన కేరళ ప్రభుత్వంపై సోషల్‌మీడియాలో ప్రశంసల కురుస్తున్నాయి. తాజాగా.. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే, అగ్నిమాపక సిబ్బంది చేసిన మరో పనిని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. నీట కొరతతో ఇబ్బందులు ఎదురుకుంటున్న ఓ గర్భిణీకి వీరు చేసిన సహాయం.. ఈ లాక్‌డౌన్ సమయంలో వాళ్లు ప్రజల ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారనేందుకు ఉదాహరణగా నిలిచింది.
తరచుగా అనారోగ్యంగా ఉంటుందని ఓ గర్బవతి తన భర్తతో కలిసి స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. అయితే అక్కడ ఆమెకి రక్తస్రావం అవుతుందని వైద్యులు నిర్ధారించారు. బరువులు మోయడం వంటి పనులు ఏమైనా చేస్తున్నావా? అని వైద్యులు ఆమెను ప్రశ్నించారు. అయితే తమ ఇంట్లో నీటి కొరత ఉందని.. అందుకే కొండ కింద ఉన్న చుట్టాల ఇంటికి వచ్చిన నీళ్లు నింపుకొని మళ్లీ కొండపైన ఉన్న తమ ఇంటికి తీసుకువెళ్తున్నానని ఆ మహిళ చెప్పింది. దీంతో డాక్టర్లు వెంటనే ఆమెను ఆ పనులు మానేయాలని సూచించారు. అయితే పూర్తిగా కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి ఆ దంపతులు ఇంటికి చేరుకొనేప్పటికీ.. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని వాళ్ల ట్యాంకును నీటితో నింపుతున్నారు.
‘అమ్మాయుమ్ అండ్ కుంజుమ్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో గర్భిణి భర్త ఓ మెసేజ్‌ని పోస్ట్ ద్వారా ఆ మహిళ కష్టం అరాన్ములా ఎమ్మెల్యే వీణా జార్జ్‌కి తెలిసింది. దీంతో ఎమ్మెల్యే ఆ నెంబర్‌కి ఫోన్ చేయగా.. తన భార్య కష్టాన్ని అతను వివరించాడు. వెంటనే ఇంట్లో ఉంటున్న వారికి ఫోన్ చేసి వారికి ఎటువంటి సహాయం కావాలో అడిగి తెలుసుకున్నారు. పతనంతిట్ట అగ్నిమాపక సేవల అధికారి వినోద్ కుమార్‌తో మాట్లాడిన ఆమె.. నీటి వాళ్ల ఇంటి వద్ద చేరవేయాలని కోరారు. అది తమకు సాధ్యమవుతుందని.. ఆ పని చేయడం తమకు ఎంతో సంతోషమని వినోద్ కుమార్ అన్నారు.
అరగంటలో సదరు గర్భిణి ఇంటి వద్దకు చేరుకున్న అగ్నిమాపక శకటాలు.. నీటితో ఆమె ఇంటి ట్యాంకును నింపేశాయి. ఆరోగ్యం కుదుటపడి.. గర్భిణి ఇంటికి చేరుకొనే సరికే ఈ పనులు అన్నీ పూర్తయ్యాయి. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. గర్భిణి ఆరోగ్యం కోసం సదరు ఎమ్మెల్యే , అగ్నిమాపక సిబ్బంది చేసిన కృషిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకు సహాయం చేసిన ఎమ్మెల్యే, అగ్నిమాపక సిబ్బంది ఎందరికో ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు అంటున్నారు.
Updated Date - 2020-04-12T18:10:14+05:30 IST