కాంగ్రెస్‌కు యువరక్తం ఎక్కించాలి
ABN, First Publish Date - 2020-12-29T09:34:04+05:30
కేరళ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధిష్ఠానానికి కేరళ నేతల డిమాండ్
తిరువనంతపురం, డిసెంబరు 28: కేరళ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకత్వం పనితీరు మారాల్సిన అవసరం ఉందని, సరిగా పనిచేయని డీసీసీ అధ్యక్షులను తప్పించాలని, పార్టీలో యువతకు ప్రాతినిధ్యం పెంచాలని వారు కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంపై సమీక్షించేందుకు వచ్చిన ఏఐసీసీ ప్రతినిధి బృందానికి ఈ మేరకు వారు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల్లో విఫలమైన డీసీసీలను వెంటనే మార్చాలని, త్వరగా కొత్త కార్యవర్గాలను ఏర్పాటుచేసి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సంసిద్దం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు.
Updated Date - 2020-12-29T09:34:04+05:30 IST