ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాలకూ డబ్బుల్లేవ్... వెంటనే 5,000 కోట్లివ్వండి : కేజ్రీవాల్

ABN, First Publish Date - 2020-05-31T19:53:53+05:30

తమ వద్ద నెలసరి వేతనాలు చెల్లించడానికి కూడా డబ్బుల్లేవని, కేంద్రం వెంటనే 5,000 కోట్ల రూపాయలను సహాయంగా అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : తమ వద్ద నెలసరి వేతనాలు చెల్లించడానికి కూడా డబ్బుల్లేవని, కేంద్రం వెంటనే 5,000 కోట్ల రూపాయలను సహాయంగా అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘ఈ క్లిష్ట సమయంలో ఢిల్లీ ప్రజలకు సహాయం చేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను’’ అని కేజ్రీవాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇదే విషయంపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆదివారం ఓ లేఖ రాశారు. జాతీయ విపత్తు నివారణ కింద రావాల్సిన నిధులు ఇంకా ఢిల్లీ ప్రభుత్వానికి చేరలేదని, వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.


‘‘ఢిల్లీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై మేము సమీక్షా సమావేశం నిర్వహించాం. రాష్ట్రానికి వచ్చే ఆదాయ, వ్యయాలపై చర్చించాం. కేవలం ఉద్యోగుస్తుల జీతాల చెల్లింపులకే తమకు నెలకు 3,500 కోట్లు కావాలి. గత రెండు నెలలుగా జీఎస్టీ ద్వారా 500 కోట్లు.. ఇతర వనరులతో 1,735 కోట్లు వచ్చాయి’’ అని సిసోడియా వివరించారు. 

Updated Date - 2020-05-31T19:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising