ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీజులు కట్టాలని డిమాండ్ చేస్తే క్రిమినల్ కేసులు : విద్యాశాఖ మంత్రి

ABN, First Publish Date - 2020-03-30T21:26:39+05:30

ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాల యాజమాన్యాలు ఎవరైనా ఫీజులు కట్టాలని, డొనేషన్స్ ఇవ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచితే క్రిమినల్ కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాల యాజమాన్యాలు ఎవరైనా ఫీజులు కట్టాలని, డొనేషన్స్ ఇవ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచితే క్రిమినల్ కేసులు పెడతామని విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు ఫీజులు, డొనేషన్లు ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నాయని తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ సమయంలో ఎవరైనా ఫీజులు, డొనేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొడానికి రెడీగా ఉండాలని హెచ్చరించారు.


‘‘2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఫీజులు, డొనేషన్లు చెల్లించాలని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎస్సెమ్మెస్ ద్వారా సందేశాలను పంపిస్తున్నారు. కరోనా నియంత్రణలోకి వచ్చే వరకు 2020-21 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లను, ఫీజుల వసూళ్లను రద్దు వాయిదా వేయాలి’’ అని ఆయన ఆదేశించారు. ఎవరైనా దీనిని ఉల్లంఘించినట్లయితే వారి పాఠశాల గుర్తింపును రద్దు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని సురేశ్ కుమార్ ప్రకటించారు. 

Updated Date - 2020-03-30T21:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising