ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రామిక్ రైళ్ల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది: యడియూరప్ప

ABN, First Publish Date - 2020-05-23T19:03:00+05:30

సొంత గ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త అందించింది. శ్రామిక్ రైళ్ల ప్రయాణానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: సొంత గ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త అందించింది. శ్రామిక్ రైళ్ల ప్రయాణానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప శుక్రవారం ప్రకటించారు. ‘‘సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బంది ఎదురుకుంటున్న వలస కార్మికుల అభ్యర్థనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వాళ్లని మా రాష్ట్రానికి చెందిన సొంత మనషులుగా భావిస్తున్న ప్రభుత్వం.. వారి పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని బలంగా భావిస్తోంది’’ అంటూ యడియూరప్ప ట్వీట్ చేశారు. 


మే 31వ తేదీ వరకూ ప్రభుత్వం ఉచితంగా శ్రామిక్ రైళ్లను నడుపుతుందని.. అధికార ప్రతినిధి ఎస్ సురేశ్ కుమార్ తెలిపారు. ‘‘వలస కార్మికుల సొంత రాష్ట్రాలు వారి ఖర్చులు భరించేందుకు నిరాకరిస్తే.. కర్ణాటక ప్రభుత్వం ఆ ఖర్చులు భరించేందుకు సిద్ధంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా కొద్ది రోజుల క్రితం ఇటువంటి నిర్ణయమే తీసుకుంది. అయితే అది పశ్చిమబెంగాల్‌కి రావాలనుకుంటున్న వారి కోసం. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు పశ్చిమబెంగాల్‌కి వచ్చేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-05-23T19:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising