ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లిం మహిళలపై దౌర్జన్యం.. కలకలం రేపుతున్న వీడియో

ABN, First Publish Date - 2020-05-18T22:50:40+05:30

బెంగళూరు: హిందువుల దుకాణాల్లో దుస్తులు కొన్న ముస్లిం మహిళలకు కొందరు ముస్లిం యువకులు వార్నింగ్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: హిందువుల దుకాణాల్లో దుస్తులు కొన్న ముస్లిం మహిళలకు కొందరు ముస్లిం యువకులు వార్నింగ్ ఇచ్చారు. బూతులు తిడుతూ అవమానించారు. మహిళల చేతుల్లో ఉన్న కాషాయం రంగు సంచులను విసిరి పారేశారు. ముస్లింల దుకాణాల్లోనే కొనాలని, హిందువుల దుకాణాల్లో ఎందుకు కొంటున్నారని మహిళలను ప్రశ్నించారు. ఘటన కర్ణాటకల దావణగెరెలో జరిగింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.




ముస్లిం మహిళలకు వార్నింగ్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత షాన్‌వాజ్ హుస్సేన్ డిమాండ్ చేశారు. దేశంలో హిందు-ముస్లిం ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరని చెప్పారు. 


కరోనా నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనల్లో పోలీసులు చురుకుగా స్పందించి బాధ్యులను అరెస్ట్ చేశారు. చెన్నైలో నో ముస్లిం స్టాఫ్ అని బోర్డు పెట్టిన బేకరీ యజమానిని అరెస్ట్ చేశారు. జంషెడ్‌పూర్‌లో హిందూ పండ్ల దుకాణం అని బ్యానర్ పెట్టిన యజమానిపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలో ముస్లిం డెలివరీ బాయ్ నుంచి పార్సల్ తీసుకోబోనని చెప్పిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో హిందు దుకాణాల్లో దుస్తులు ఖరీదు చేసిన ముస్లిం మహిళలకు వార్నింగ్ ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని యెడ్యూరప్ప సర్కారును బీజేపీ కోరింది. 

Updated Date - 2020-05-18T22:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising