ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో నేడు భయంకరంగా పెరిగిన కేసులు

ABN, First Publish Date - 2020-05-23T21:24:56+05:30

కర్ణాటకలో కోవిడ్ కేసులు ఈ రోజు ఒక్కసారిగా పెరిగాయి. నేడు ఏకంగా 196 కేసులు వెలుగు చూశాయి. తాజా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటకలో కోవిడ్ కేసులు ఈ రోజు ఒక్కసారిగా పెరిగాయి. నేడు ఏకంగా 196 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,939కి పెరిగింది. అలాగే, నేడు బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి కోవిడ్ కారణంగా మృతి చెందాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 42కు చేరింది. తాజాగా కరోనా మహమ్మారి బారినపడిన వారిలో 172 మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మిగతా వారిలో ఇద్దరు గుజరాత్ నుంచి రాగా,  ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు నుంచి వచ్చిన వారిలో ఒక్కొక్కరు వైరస్ బారినపడినట్టు పేర్కొన్నారు.  మరో 15 మందికి కోవిడ్ రోగుల ద్వారా సంక్రమించినట్టు తెలిపారు. ముగ్గురిలో ఇన్‌ఫ్లూయెంజా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 598 మంది డిశ్చార్జ్ కాగా, 1,297 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  

Updated Date - 2020-05-23T21:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising