ఆ చట్టంతో 90 శాతం మంది సంతోషంగా ఉన్నారు: యడియూరప్ప
ABN, First Publish Date - 2020-12-12T03:45:38+05:30
కర్నాటక ప్రభుత్వం తీసుకొచ్చిన గోవధ నిరోధక చట్టం పట్ల 90 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప...
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం తీసుకొచ్చిన గోవధ నిరోధక చట్టం పట్ల 90 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. ‘కర్నాటక గోవధ నిరోధక, పశు సంరక్షణ బిల్లు-2020’ ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా సీఎం ఇవాళ ఓ గోవుకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ భారత సంప్రదాయం ప్రకారం గోవులను సంపదకు సంకేతంగా భావిస్తారు. ఇవాళ మేము ‘గోపూజ’ చేశాం. వదిలివేసిన ఆవులకు మేము అన్ని సదుపాయాలు కల్పిస్తాం. 90 శాతం మంది ఈ బిల్లుతో సంతోషంగా ఉన్నారు..’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, జేడీయూ సహా ప్రతిపక్షాల తీవ్ర నిరసన నడుమ ఈ నెల 9న కర్నాటక అసెంబ్లీలో గోవధ నిరోధక బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద నేరం రుజువైతే... మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష లేదా రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. తీవ్రమైన నేరాల్లో రూ.10 జరిమానా, ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
Updated Date - 2020-12-12T03:45:38+05:30 IST