ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరునెలలకోసారి అవిశ్వాసం .. సీఎం యడియూరప్ప సెటైర్

ABN, First Publish Date - 2020-09-25T17:51:59+05:30

కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. యడియూరప్ప సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. యడియూరప్ప సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి ఇచ్చారు. దీనిపై కర్ణాటక సీఎం యడియూరప్ప మాట్లాడుతూ విపక్షాలపై సెటైర్లు వేశారు. ‘వాళ్లు చేసేదేదో చెయ్యనివ్వండి. ప్రతి ఆరునెలలకు ఓసారి అవిశ్వాస తీర్మానం పెట్టడం... మరో ఆరునెలల నన్ను సేఫ్ జోన్‌లో పడేయడం వాళ్లకు అలవాటైంది’ అని వ్యాఖ్యానించారు. 


మరోవైపు కాంగ్రెస్‌ తీరుపై జేడీఎస్ చీఫ్ కుమార స్వామి తనదైన శైలిలో అభిప్రాయం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ తమను సంప్రదించలేదని కుమారస్వామి అన్నారు. తమ బలం అవసరం లేదని వాళ్లు భావిస్తున్నారని.. స్వతంత్రంగా పోరాడొచ్చని అనుకుంటున్నారని ఆయన అన్నారు.  


ఇదిలా ఉంటే.. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సభ్యులు 225. బీజేపీ బలం 116 కాగా, కాంగ్రెస్ 67, జేడీఎస్ 33, బీఎస్పీ, నామినేట్ అయినవాళ్లు ఒక్కొక్కరు, స్వతంత్రులు ఇద్దరు, స్పీకర్ ఉన్నారు. 

Updated Date - 2020-09-25T17:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising