ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫరీదాబాద్ హోటల్ నుంచి పారిపోయిన వికాస్ దూబే

ABN, First Publish Date - 2020-07-08T12:08:28+05:30

మోస్ట్ వాంటెడ్ కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే ఫరీదాబాద్ హోటల్ నుంచి పోలీసుల బారి నుంచి మరో సారి తప్పించుకున్నాడు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మోస్ట్ వాంటెడ్ కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే ఫరీదాబాద్ హోటల్ నుంచి పోలీసుల బారి నుంచి మరో సారి తప్పించుకున్నాడు. కాన్పూరులో 8 మంది పోలీసులను చంపి తప్పించుకు తిరుగుతున్న ముఠా నాయకుడు వికాస్ దూబే ఢిల్లీ-మధుర జాతీయ రహదారిపై ఫరీదాబాద్ నగరంలోని బద్కల్ చౌక్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ లో దాక్కున్నాడని స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. అంతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం పోలీసులు వికాస్ దూబేను పట్టుకునేందుకు దాడి చేయగా, అప్పటికే అతను హోటల్ నుంచి పారిపోయాడు. వికాస్ దూబేతో పాటు కలిసి ఉన్న అతని అనుచరుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. వికాస్ దూబేను పట్టుకునేందుకు 35 మంది ఎస్టీఎఫ్ పోలీసులు మఫ్టీలో హోటల్ పై దాడి చేశారు. హోటల్ యజమానితోపాటు హోటల్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వికాస్ దూబే ముఖానికి మాస్క్ ధరించి నిలబడి ఉన్న ఫొటోను పోలీసులు హోటల్ సిబ్బందికి చూపించారు. హోటల్ లో రికార్డులను సీజ్ చేసి వికాస్ దూబే మకాం గురించి ఆరా తీస్తున్నారు. పోలీసు బృందాలు వికాస్ దూబే కోసం ఇప్పటికే 100ప్రాంతాల్లో దాడులు చేసినా అతను దొరకలేదు. 

Updated Date - 2020-07-08T12:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising