శివసేనపై మరోసారి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2020-09-15T00:20:48+05:30
సుశాంత్ సింగ్ ఆత్మహత్య మిస్టరీలో మొదట్లో ఆదిత్య థాకరేపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే అనంతర కాలంలో ఆ ఆరోపణలు అన్నీ సర్ధుమనిగాయి. కాగా తాజాగా కంగనా చేసిన ఆరోపణలతో
ముంబై: మహారాష్ట్రలో అధికార పార్టీయైన శివసేనపై సినీనటి కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రేపై కంగనా తీవ్ర ఆరోపణ చేశారు. బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్‌తో ఆదిత్య థాక్రేకు సంబంధాలు ఉన్నాయని కంగనా ఆరోపణలు గుప్పించారు. డ్రగ్స్ మాఫియాను ఎదిరించినందుకే తనపై మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. ఇది వరకు ముంబై నగరం సురక్షితమని అనిపించేదని చెప్పిన కంగనా ముంబైలో తనను భయోత్పాతానికి గురి చేశారని శివసేనపై నిప్పులు చెరిగారు.
సుశాంత్ సింగ్ ఆత్మహత్య మిస్టరీలో మొదట్లో ఆదిత్య థాకరేపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే అనంతర కాలంలో ఆ ఆరోపణలు అన్నీ సర్ధుమనిగాయి. కాగా తాజాగా కంగనా చేసిన ఆరోపణలతో ఆదిత్య మళ్లీ ప్రధాన వార్తగా అయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ వ్యవహారంలో ఆదిత్య ఎలాంటి విచారణ ఎదుర్కోనున్నారనేది చూడాలి మరి.
Updated Date - 2020-09-15T00:20:48+05:30 IST