ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జస్టిస్‌ కర్ణన్‌ అరెస్టు

ABN, First Publish Date - 2020-12-03T08:16:06+05:30

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ను చెన్నై పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపైన, న్యాయమూర్తుల భార్యలపైన అనుచితమైన, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడమే గాక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్జిలు, వారి భార్యలపై అనుచిత వ్యాఖ్యలు

చెన్నై, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ను చెన్నై పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపైన, న్యాయమూర్తుల భార్యలపైన అనుచితమైన, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడమే గాక.. వాటిని ఆన్‌లైన్లోనూ ఆయన అప్‌లోడ్‌ చేశారు. కొందరు న్యాయమూర్తులు కోర్టుల్లోని మహిళా సిబ్బందిపై, మహిళా జడ్జిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు. దీంతో ఆయనపై మద్రాసు హైకోర్టు లో అక్కడి బార్‌ కౌన్సిల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై నవంబరు 30న జస్టిస్‌ సత్యనారాయణన్‌, జస్టిస్‌ హేమలతల ధర్మాసనం విచారణ జరిపింది. పోలీసు శాఖ తరఫున హాజరైన న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జస్టిస్‌ కర్ణన్‌ను విచారించామని, జడ్జిలను కించపరిచేలా వీడియోలను ఇకపై విడుదల చేయనని ఆయన హామీ ఇచ్చారన్నారు. దీనిపై బెంచ్‌ మండిపడింది. సుప్రీం జడ్జిల పరువు ప్రతిష్ఠలను దిగజార్చేలా విమర్శలు చేసిన ఆయన్ను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. తదుపరి విచారణ 7న జరుపుతామని.. ఆ రోజు రాష్ట్ర డీజీపీ, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ తమ ఎదుట హాజరుకావాలని ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చెన్నై ఆవడిలో నివసిస్తున్న జస్టిస్‌ కర్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2020-12-03T08:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising