ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ను కిందపడేసిన పోలీసులు

ABN, First Publish Date - 2020-10-01T21:15:14+05:30

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి, పోలీసులకు గ్రేటర్ నోయిడా వద్ద తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి, పోలీసులకు గ్రేటర్ నోయిడా వద్ద తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్, ప్రియాంక బయల్దేరారు. వారిని పోలీసులు యమునా ఎక్స్‌ప్రెస్ వద్ద అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ కార్యకర్తలతో కలిసి నడక ప్రారంభించారు. దీనిని అడ్డుకునే క్రమంలో రాహుల్ గాంధీకి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.


ఈ క్రమంలో పోలీసులు రాహుల్‌ను కిందతోసేశారు. దీనిపై రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పోలీసులే నన్ను కిందకు తోసేశారు. నాపై లాఠీఛార్జ్ చేశారు. ఏం చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రోడ్డుపై కేవలం మోదీయే నడవాలా? సామాన్యులు నడిచే హక్కు లేదా? మా వాహనాలను ఆపేశారు. అందుకే మేం నడక ప్రారంభించాం.’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 











Updated Date - 2020-10-01T21:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising