ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదే పదే జవాన్లను అవమానించకండి : కాంగ్రెస్ పై నడ్డా ఫైర్

ABN, First Publish Date - 2020-06-22T20:52:55+05:30

గాల్వాన్ ఘటనపై మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : గాల్వాన్ ఘటనపై మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. భారత దేశానికి చెందిన వందల చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు దయతో అప్పగించారని ఆయనపై నడ్డా మండిపడ్డారు. అంతేకాకుండా 2010 -2013 మధ్య పొరుగు దేశం చేసిన 600 చొరబాట్లకు ఆయన అధ్యక్షత వహించారని ఆరోపించారు.


చైనా విషయంలో కాంగ్రెస్ పదే పదే ప్రధాని మోదీని దుమ్మెత్తి పోస్తోందని, మొదట జవాన్లను పదే పదే అవమానించడం, వారి శౌర్యాన్ని ప్రశ్నించడం కాంగ్రెస్ మానుకోవాలని మండిపడ్డారు.


‘‘చైనాకు నిస్సహాయతతో 43,000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని ధారాదత్తం చేసిన పార్టీ నాయకుడు. యూపీఏ ఏలుబడిలో ఎలాంటి పోరాటాలు, వ్యూహం ఆచరించకుండానే  లేకుండానే చైనాకు లొంగిపోవడం చూశాం. వందల చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు అప్పగించిన సమయంలో మన్మోహన్ చైనా డిజైన్ల గురించి ఆందోళన పడ్డారు. 2010 నుంచి 2013 సంవత్సరాల మధ్య కాలంలో 600 చొరబాట్లకు ఆయన అధ్యక్షత వహించారు’’ అని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-22T20:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising