ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్‌ను మూటముల్లె సర్దుకోమని చెప్పండి: జో బైడెన్

ABN, First Publish Date - 2020-11-03T19:18:23+05:30

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ తరుణంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ తరుణంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మూటముల్లె సర్దుకుని బయల్దేరాల్సిన సమయం వచ్చిందని జో బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికన్లు తమ ఓటుతో ఈ విషయాన్ని ట్రంప్‌కు అర్థమయ్యేలా చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ట్రంప్ పాలనలో కరోనా వల్ల 2,30000 మంది చనిపోయారని, దాదాపు 30 మిలియన్ల మంది ఉపాధి కోల్పోయారని బైడెన్ చెప్పుకొచ్చారు. ఈ నాలుగేళ్లుగా చేసింది చాలని, గందరగోళంతో తాము విసిగిపోయామని బైడెన్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉంటే.. భారత ఎన్నికలకు, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పొంతన లేదు. భారత్ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువ ఓట్లు ఎవరికి వేస్తే వారిదే విజయం! కానీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలా కాదు!! ప్రజల ఓట్లు ఎన్నొచ్చాయన్నది కాదు లెక్క.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎన్నొచ్చాయన్నదే లెక్క. అందుకే.. 2016 ఎన్నికల్లో ట్రంపు కన్నా హిల్లరీకి 28.68 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినా.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎక్కువగా దక్కించుకున్నట్రంపే శ్వేతసౌధాధిపతి అయ్యారు. సంక్లిష్టంగా ఉంటూ సుదీర్ఘంగా సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విచిత్రమిది. ‘విన్నర్‌ టేక్స్‌ ఆల్‌’ అనే సూత్రం ప్రత్యేకత ఇది. అన్ని రాష్ట్రాల మద్దతు ఉన్న అభ్యర్థే అధ్యక్షుడు కావాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని వారు ఎంచుకున్నారు.


సాధారణంగా అమెరికాలో కొన్ని రాష్ట్రాలు డెమొక్రాట్లకు, కొన్ని రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్నాయి. ఎటూ మొగ్గని రాష్ట్రాలను స్వింగ్‌ స్టేట్స్‌ అంటారు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేవి ఆ రాష్ట్రాలే. అవి.. ఫ్లోరిడా (29), పెన్సిల్వేనియా (20), ఒహాయో (18), మిచిగన్‌ (16), నార్త్‌ కరోలినా (15), అరిజోనా (11), విస్కాన్సిన్‌ (10). వీటిలో మొత్తం 119 ఎలక్టొరల్‌ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో  పోలింగ్‌ నువ్వానేనా అన్నట్లు ఉండడంతో ఓట్ల లెక్కింపు కూడా బాగా ఆలస్యమవుతుంటుంది. 2016 ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడు రాష్ట్రాల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేశారు.



Updated Date - 2020-11-03T19:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising