ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి వార్‌రూమ్‌లు... 11 పట్టణాల్లో 144 సెక్షన్ అమలు!

ABN, First Publish Date - 2020-09-20T14:54:24+05:30

రాజస్థాన్‌లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటం అక్కడి ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా 1,834 కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ సర్కారు కరోనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్థాన్‌లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటం అక్కడి ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా 1,834 కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ సర్కారు కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని జిల్లా ముఖ్యకేంద్రాలలోని కొన్ని బహిరంగ ప్రదేశాలలో 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఐదురురికి మించి గుమిగూడటాన్ని నిషేధించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో కరోనా కట్టడికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. 


జిల్లా స్థాయిలో సైతం కోవిడ్-19 వార్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులకు సహాయం అందించేందుకు ఈ వార్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా అధికారులు పర్యవేక్షించనున్నారు. సామూహిక కార్యక్రమాలను అక్టోబరు 31 వరకూ నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అంతిమ సంస్కారాలకు 20 మంది, వివాహాది శుభకార్యాలకు 50 మంది వరకూ పాల్గొనేందుకు అనుమతినివ్వనున్నారు.

Updated Date - 2020-09-20T14:54:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising