ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది పోలీస్‌ రాజ్యంలా ఉంది

ABN, First Publish Date - 2020-10-19T06:35:25+05:30

మహారాష్ట్ర గవర్నర్‌ వివాదం సద్దు మణగక ముందే పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధనకర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మమత సర్కార్‌కు బెంగాల్‌ గవర్నర్‌ లేఖ

కోల్‌కతా: మహారాష్ట్ర గవర్నర్‌ వివాదం సద్దు మణగక ముందే పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధనకర్‌.. మమతా బెనర్జీ సర్కార్‌పై మళ్లీ దండెత్తారు. ‘బెంగాల్‌లో రాజకీయ హింస కొనసాగుతోంది. ప్రతీకార కక్షలు పెచ్చుమీరుతున్నా యి. కస్టడీల్లో మరణాలు ఎక్కువవుతున్నాయి. రాష్ట్రం పోలీసు రాజ్యంలా మారింది. ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి’ అని ఆయన తీవ్ర పదజాలంతో ఓ లేఖాస్త్రం సంధించారు.


‘మాజీ ఆర్మీ జవాను టర్బన్‌ను పోలీసులు లాగేయడం చూశాం. మానవ హక్కుల ఉల్లంఘనకు ఇదో సంకేతం. మదన్‌ ఘొరాయ్‌ కస్టడీలో మరణించడం పోలీసుల దుష్కృత్యాలకు నిదర్శనం. ఇది రాష్ట్ర ప్రతిష్టకే సిగ్గుచేటు. చట్టం, న్యాయం లేక రాష్ట్రం అరాచకంగా మారింది. కాస్త ప్రజాస్వామ్యయుతంగా పాలించండి’ అని జగదీప్‌ ధన్‌కర్‌ తీవ్రంగా దూషిస్తూనే హితవచనాలు చెప్పారు.

ఈ లేఖపై మమత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ రాజ్యాంగ పరిధిని గుర్తెరిగి ప్రవర్తించండని బదులిచ్చారు.


Updated Date - 2020-10-19T06:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising