ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది హత్యే.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సంచలన వ్యాఖ్య

ABN, First Publish Date - 2020-08-23T01:45:19+05:30

పీపీఈ కిట్ల కొనుగోళ్ల చుట్టూ నెలకొన్ని అవినీతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ అథానమ్ హత్యగా అభివర్ణించారు. అవినీతి కారణంగా వైద్య సిబ్బంది పీపీఈ కిట్లకు దూరమవుతున్నారని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: పీపీఈ కిట్ల కొనుగోళ్ల చుట్టూ నెలకొన్న అవినీతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథానమ్ హత్యగా అభివర్ణించారు. అవినీతి కారణంగా వైద్య సిబ్బంది పీపీఈ కిట్లకు దూరమవుతున్నారని తెలిపారు. దీని వల్ల వారే కాకుండా పేషెంట్లు కూడా ప్రమాదంలో పడుతున్నారని ఆయన తేల్చిచెప్పారు. ‘పీపీఈ కిట్లు లేకపోతే వైద్య సిబ్బంది ప్రమాదంలో పడతారు. వారి సేవలను పొందేవారు కూడా ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఇది కచ్చితంగా నేరమే.. హత్యే.. దీనికి ముగింపు పలకాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రియాలో పీపీకిట్ల పంపిణీలో నెలకొన్న అవినీతిపై ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదన్న ఆయన..పీపీఈ కిట్ల విషయంలో అవినీతి మాత్రం హత్యా నేరంతో సమానమని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-08-23T01:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising