ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ కార్యాలయంలో ఐటీ దాడులు...

ABN, First Publish Date - 2020-10-23T11:15:43+05:30

బీహార్ ఎన్నికల నేపథ్యంలో పట్నాలోని బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.8.5 లక్షలు  స్వాధీనం 

పట్నా (బీహార్) : బీహార్ ఎన్నికల నేపథ్యంలో పట్నాలోని బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆదాయపుపన్నుశాఖ దాడులు చేసింది. కాంగ్రెస్ కార్యాలయం ఆవరణలో నిలిపి ఉంచిన కారులో నుంచి రూ.8.5 లక్షల నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని అయిన కాంగ్రెస్ కార్యకర్త అశుతోష్ ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొని నగదు గురించి ప్రశ్నిస్తున్నారు. 


 కాంగ్రెస్ కార్యాలయంలో నగదు దొరకడంతో బీహార్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి శక్తి సింగ్ గోహిల్, జాతీయ మీడియా ఇన్‌ఛార్జి రణదీప్ సుర్జేవాలాను కూడా ఆదాయపు పన్ను అధికారులు ప్రశ్నించారు.తమకు అందిన రహస్య సమాచారం మేర తాము కాంగ్రెస్ కార్యాలయంలో దాడులు చేశామని ఐటీ అధికారులు చెప్పారు.కాంగ్రెస్ కార్యాలయంపై ఐటీ దాడులను ఆ పార్టీ నాయకుడు శక్తిసింగ్ గోహిల్ వ్యతిరేకించారు.బీహార్ ఎన్నికల్లో ఓడిపోతున్న బీజేపీ, జేడీయూ పార్టీ నేతల సూచనల మేర తమ పార్టీ కార్యాలయంపై ఐటీ అధికారులు  దాడులు చేశారని, డబ్బు ఉన్న కారుతో తమ కాంగ్రెస్ కు  సంబంధం లేదని శక్తిసింగ్ గోహిల్ చెప్పారు. 

Updated Date - 2020-10-23T11:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising