ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అక్కడ మరోమారు లాక్‌డౌన్

ABN, First Publish Date - 2020-09-19T11:51:00+05:30

ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య మూడు కోట్లను దాటింది. 9 లక్షలకుపైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా కేసుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య మూడు కోట్లను దాటింది. 9 లక్షలకుపైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలోనే పలు దేశాల్లో మరోమారు లాక్‌డౌన్ లేదా పాక్షిక లాక్‌డౌన్ విధిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేశారు. దీని గురించి మాడ్రిడ్ ప్రభుత్వ ప్రతినిధి ఇసాబెల్ డియాజ్ అయుసో మాట్లాడుతూ మాడ్రిడ్ అంతటికీ కరోనా వ్యాపించకుండా ఉండేందుకు కొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని తెలిపారు. 


ఇదేవిధంగా ఇజ్రాయిల్‌లో కరోనా కేసులను నియంత్రించేందుకు మరోమారు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దేశవాసులంతా తమ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మూడు వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రధాని నెతాన్యాహూ తెలిపారు. ఇక కరోనా కేసుల విషయానికొస్తే అమెరికా టాప్‌లో ఉంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య 67 లక్షలు దాటింది. అలాగే ఈ వైరస్ కారణంగా అమెరికాలో మొత్తం 1,98,000 మంది మృతి చెందారు. 25 లక్షలకు పైగా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. 

Updated Date - 2020-09-19T11:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising