ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇజ్రాయెల్, యూఏఈ చారిత్రక ఒప్పందం.. ట్రంప్ హర్షం..

ABN, First Publish Date - 2020-08-14T05:14:09+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇజ్రాయెల్ మధ్య ఇవాళ చారిత్రక ఒప్పందం కుదరింది. దీంతో పాలస్తీనా అక్రమణ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇజ్రాయెల్ మధ్య ఇవాళ చారిత్రక ఒప్పందం కుదిరింది. దీంతో పాలస్తీనా ఆక్రమణపై ఇరుదేశాల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైరానికి ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పడింది. ఇరుదేశాలు ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో శాంతిని, సాధారణ జీవనాన్ని పునరుద్ధరించడంలో ఇది ‘‘భారీ ముందడుగు’అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.  ‘‘అద్భుత పురోగతి ఇది! మాకు గొప్ప మిత్రులైన ఇజ్రాయెల్, యూఏఈ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది..’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరుదేశాల నాయకత్వాలతో అమెరికా అధ్యక్షుడు చురుకైన చర్చలు జరపడం ద్వారానే ఈ ఒప్పందం సాధ్యమైందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. తాజా ఒప్పందంతో.. ప్రస్తుతం ఇజ్రాయెల్, యూఏఈల మధ్య మూడోదేశం మధ్యవర్తిత్వానికి బదులు ఇరు దేశాలు ‘‘పూర్తిస్థాయి ద్వైపాక్షిక సంబంధాలతో’’ చర్చలు జరుగుతాయి. ఇంధనం, వాణిజ్యం, భద్రత, టెలీ కమ్యునికేషన్, హెల్త్‌కేర్, పర్యావరణం తదితర అంశాల్లో ఉమ్మడి అభివృద్ధి కోసం ఇరు దేశాల ప్రతినిధులు త్వరలో సమావేశమై సంతకాలు చేయనున్నారు.



Updated Date - 2020-08-14T05:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising